ఏపీలో కొత్త‌గా మ‌రో 80 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది. అంతంకంత‌కూ క‌రోనా సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కొత్త‌గా మ‌రో 80 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య 1,177కి చేరింది. ఈ మేర‌కు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల్లో కృష్ణా జిల్లా 33, గుంటూరు 23, క‌ర్నూలు 13, నెల్లూరు 7, ప‌.గో 3, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు న‌మోదైంది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 6,517 న‌మునాలు ప‌రిశీలించిన‌ట్లు అధికారులు తెలిపారు. అటు ఇప్ప‌టివ‌ర‌కు 31 మంది మ‌ర‌ణించ‌గా...235 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా 911యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో అత్య‌ధికంగా క‌ర్నూలు జిల్లాలో 292 కేసులు న‌మోదు కాగా, గుంటూరు 237,  కృష్ణా 210, నెల్లూరు 79,  ప‌.గో 54 కేసులు ఉన్నాయి.